సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

ఇల్లెందురూరల్‌: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాంరాథోడ్‌ హెచ్చరించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు విధిగా సబ్‌సెంటర్లలో ఉండాలని స్పష్టం చేశారు. ఇల్లెందు మండలం రొంపేడు పీహెచ్‌సీ, పలు గ్రామాల్లోని సబ్‌సెంటర్లను బుధవారం ఆయ న తనిఖీ చేశారు. ఒడ్డుగూడెం సబ్‌సెంటర్‌ను తని ఖీ చేసిన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మెమో జారీ చేశారు. అనంతరం రొంపేడు పీహెచ్‌సీని సందర్శించి వైద్యసేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అలాగే, స్వయంగా బీపీ చెక్‌ చేయించుకొని పరికరం పనితీరును పరిశీలించారు. పీహెచ్‌సీ నర్సింగ్‌ ఆఫీసర్‌ వైద్యకారణాలతో సెలవు పెట్టడంపై వాకబు చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని సూచించారు. రొంపేడు వైద్యాధికారి రుషిత, ఉద్యోగులు భద్రమ్మ, రాజు, శ్రీనివాస్‌, గన్య, సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్‌

Advertisement
 
Advertisement
Advertisement