ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

కరకగూడెం: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మైపతి అరుణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు వచ్చేనెల 3న మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని కోరారు. కరకగూడెం మండలం వీరాపురం క్రాస్‌ వద్ద బుధవారం తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనారాయణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కలం వేణుగోపాల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఇతర వర్గాలకు మళ్లుతుండడంతో యువత తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రిజర్వేషన్లతో పాటు పోడు భూములు, భూమి హక్కుల సమస్యలపై పోరాట కార్యాచరణ రూపొందించేందుకు నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయా లని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు సుతారి నాగేశ్వరరావు, కలం సంపత్‌కుమార్‌, సాంబమూర్తి, చందా రామకృష్ణ పాల్గొన్నారు.

తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement