సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

ములకలపల్లి: సెల్‌ఫోన్‌ చూడడం తగ్గించి ఇంట్లో పనులు చేయాలని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కోండ్రు ప్రసాద్‌ – నాగమణి దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు అశ్విని (19) గత ఏడాది ఇంటర్‌ పూర్తిచేయగా హైదరాబాద్‌లో కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటూ వారం క్రితం ఇంటికి వచ్చింది. కాగా, నాగమణి తల్లి అనారోగ్యానికి గురవడంతో మంగళవారం స్వగ్రామమైన జగన్నాథపురం వెళ్తూ సెల్‌ఫోన్‌ వాడకం తగ్గించి, ఇంటి పనులు చేయాలని అశ్వినిని మందలించి బయలుదేరింది. దీంతో మనస్తాపానికి గురైన అశ్విని పురుగులమందు తాగగా కొద్దిసేపటికి గుర్తించిన స్థానికులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుప్రసాద్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement