జీవిత పాఠం..
అష్టాదశ శ్లోకాలపై శిక్షణ
ఖమ్మంగాంధీచౌక్: భగద్గీతలో అష్టాదశ శ్లోకాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మహాభారత యుద్ధం సమయాన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతాసారమే భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఖమ్మం గుట్టలబజార్‌లోని శ్రీరామకృష్ణ విద్యాలయం ఉపాధ్యాయురాలు అపర్ణ విద్యార్థులకు భగవద్గీతతో పాటు రామాయణం, మహాభారతంపై శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా భగవద్గీతలోని అష్టాదశ శ్లోకాలపై ఇస్తున్న శిక్షణకు మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. ఈ శ్లోకాల సారం జీవిత పాఠాలను నేర్పుతుందని, సమాజంలో బాధ్యతలను గుర్తుచేస్తాయని నమ్ముతున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాక శ్లోకాల పఠనం ద్వారా విద్యార్థుల్లో భాష ఉచ్ఛారణ, స్పష్టత వస్తుందని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమాన వేసవిలో ఉదయం నామమాత్రపు ఫీజుతో పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని రేణుక తెలిపారు.


