హెచ్‌సీఏ టుడే లీగ్‌కు భద్రాచలం క్రికెటర్లు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ టుడే లీగ్‌కు భద్రాచలం క్రికెటర్లు

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలోని చేతన బెస్ట్‌ క్రికెట్‌ అకాడమీకి చెందిన నలుగురు క్రికెటర్లు హెచ్‌సీఏ టుడే లీగ్‌ క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యా రు. అకాడమీలో శిక్షణ పొందుతున్న రత్న ఆర్యన్‌, ప్రసన్న కుమార్‌, హర్షవర్ధన్‌నాయుడు, సుహాస్‌కు ఉమ్మడి జిల్లా జట్టులో చోటు దక్కగా, టోర్నీలో పాల్గొననున్నారు. క్రికెటర్లను అకాడమీ కోచ్‌లు చరణ్‌ తేజ, రవితేజ తదితరులు అభినందించారు.

గిన్నిస్‌ రికార్డ్‌లో

పాల్వంచ యువతి

పాల్వంచ: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 2న జరిగిన సామూహిక కీబోర్డ్‌ ప్లే ప్రదర్శనలో 22 దేశాల నుంచి 2 వేల మంది పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన పలువురిని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు ఎంపిక చేయగా పాల్వంచకు చెందిన కండేల్‌ నతానియేల్‌ కుమార్తె అనూషకు స్థానం దక్కింది. ఈ మేరకు ఆమె హల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ వ్యవస్థాపకులు అగస్టీన్‌ నుంచి బుధవారం ధ్రువపత్రం అందుకున్నారు.

ఆర్టీసీలో

పదోన్నతులు, బదిలీలు

ఖమ్మంమయూరిసెంటర్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీలో) ఖమ్మం రీజియన్‌ పరిధిలో పలువురు డ్రైవర్లు, కండక్టర్లకు పదోన్నతులు లభించాయి. డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ సిఫారసుల మేరకు డ్రైవర్‌ గ్రేడ్‌–1/2, కండక్టర్‌ గ్రేడ్‌–1/2 కేడర్‌కు చెందిన తొమ్మిది మందికి ఏడీసీ/కంట్రోలర్లుగా పదోన్నతి కల్పి స్తూ ఆర్‌ఎం ఎ.సరిరామ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన ఉద్యోగులను పలు డిపోలకు బదిలీ చేశారు. సత్తుపల్లి డిపో నుంచి కేఎస్‌ ప్రసాద్‌, ఎన్‌ఆర్‌ కృష్ణను సత్తుపల్లికే కేటాయించగా, కె.సాయిరామ్‌ను మధిరకు కేటా యించారు. మణుగూరులో విధులు నిర్వర్తి స్తు న్న ఎల్‌.వాసుదేవరెడ్డి, పీఎస్‌ రాములును భద్రాచలానికి, ఖమ్మం నుంచి జీవీరావును ఇల్లెందు కు, భద్రాచలంలో పనిచేస్తున్న కె.ప్రతాప్‌ను భ ద్రాచలానికే, కొత్తగూడెంలో పనిచేస్తున్న సీహెచ్‌.శ్రీనివాసులును భద్రాచలానికి, మణుగూరులో పనిచేస్తున్న కె.వెంకటేశ్వర్లును మధిరకు కేటాయించారు. ఇక ఏడీసీలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానచలనం కల్పించగా.. ఇల్లెందులో పనిచేస్తున కె.వెంకటేశ్వర్లు, మధిరలో పనిచేస్తున్న ఎం.రాయప్ప, కె.వెంకన్న, సత్తుపల్లిలో పనిచేస్తు న్న పి.అప్పారావు, బీఆర్‌ రెడ్డిని ఖమ్మం బదిలీ చేశారు. ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లును సత్తుపల్లికి, భద్రాచలంలో పనిచేస్తున్న ఎన్‌.ఠాకూర్‌ను ఇల్లెందుకు, కోదాడ విజిలెన్స్‌ నుంచి కె.శామ్యూల్‌ను కొత్తగూడెంకు, భద్రాచలం నుంచి ఎస్‌కేఎం సాహెదాను విజిలెన్స్‌ కోదాడకు బదిలీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement