భద్రాచలంటౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ జనగామ జిల్లాకు చెందిన బొడ్డు ప్రవీణ్ మంగళవారం భద్రాద్రి రామయ్యకు వినూత్నంగా మొక్కు చెల్లించుకున్నారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ఆయన.. భద్రాచలం ఆలయ మెట్లను మోకాళ్లపై ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. జగన్ మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు 99 ఆలయాలను సందర్శించానని, 100వ క్షేత్రంగా భద్రాద్రికి చేరుకున్నానని ఆయన తెలిపారు. రాములోరి ఆశీస్సులతో జగనన్న మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తూ తన యాత్రను విజయవాడ వరకు కొనసాగిస్తానని పేర్కొన్నారు.


