ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: గిరిజన సంక్షేమశాఖ జీపీఎస్ పాఠశాలల్లో చదివే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ అందించేలా ఉద్దీపనం వర్క్ బుక్‌లో మార్పులు, చేర్పులతో ప్రణాళిక రూపొందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. మంగళవారం ఐటీడీఏలో ఎస్సార్పీలు, ఉపాధ్యాయులతో ఉద్దీపకం వర్క్ బుక్ తయా రీ ప్రణాళికలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి వర్క్ బుక్‌లో మార్పులు చేయాలన్నారు. మూడో తరగతి పిల్లలకు వర్క్ బుక్ నిర్వహణ నిరంతరంగా ఉండాలని, ఇంగ్లిష్ వర్క్‌బుక్‌లో స్టాండర్డ్ పెంచాలని, శాస్త్రవేత్తలు, మహనీయులు, సైన్స్, జాగ్రఫీ తది తర అంశాలను పొందుపర్చాలని సూచించా రు. జూన్ 20న విద్యార్థులకు అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించాలని చెప్పారు. 7,8 తరగతులు చదివే విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా గణితం, ఆంగ్లంలో వర్క్ బుక్ తయారుచేసి వారానికి రెండుసార్లు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూ చించారు. అధికారులు అశోక్, రమేష్, ఎస్‌సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


