అంజన్న భ క్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

అంజన్న భ క్తుల సందడి

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

భద్రాచలం: రామబంటు మాలధారులతో భద్రగిరిలో మంగళవారం సందడి నెలకొంది. దీక్షాపరులు హనుమాన్‌ జయంతి సందర్భంగా మాల విరమించేందుకు భద్రాచలం తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. దీంతో ఆలయ అధికారులు స్వర దర్శన వేళలను పొడిగించారు. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయమైన ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు మాలధారులకు దీక్షా విరమణ గా వించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా అభయాంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం, తమలపాకులతో అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం అదనపు లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

కమనీయంగా నిత్యకల్యాణం

దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు. ఈఓ దామోదర్‌రావు పూజాది కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

భద్రగిరిలో ఘనంగా

హనుమాన్‌ జయంతి వేడుకలు

Advertisement
 
Advertisement
Advertisement