జూలూరుపాడు/చండ్రుగొండ : ప్రభుత్వాస్పత్రుల్లో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. చండ్రుగొండ, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు, వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల్లో అలసత్వం చూపొద్దని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం పోకలగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న స్నేహ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యాధికారులు రాము, బి.వెంకటేశ్వర్లు, బి. వెంకటేష్, సిబ్బంది శోభశ్రీ, రమాదేవి, సునీత, రమ్యశ్రీ, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరావు జి.శశి కళ, రత్నకుమార్, రాధిక, ప్రియదర్శని పాల్గొన్నారు.


