ఉద్యాన కళాశాలకు భూమి పూజ.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన కళాశాలకు భూమి పూజ..

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

రానున్న విద్యాసంవత్సరం నుంచే తరగతులు

అశ్వారావుపేట: అశ్వారావుపేటలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ ఉద్యాన కళాశాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈనెల 14న భూమి పూజ చేయనున్నారు. రానున్న విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఉద్యాన యూనివర్సిటీ అధికారులు కళాశాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధనా కేంద్రం (హెచ్‌ఆర్‌ఎస్‌)లో కళాశాల భవనం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న హెచ్‌ఆర్‌ఎస్‌ భవనం మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందే 30 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమం వివరాలు అధికారంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement