దమ్మపేట: భగవద్గీతను రాబోయే తరాలకు అందించేలా ప్రతి దేవాలయంలో గీత శ్లోకాలను భక్తులకు వినిపించాలని అభయ్ హిందూ సేవ వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ అన్నారు. సోమవారం దమ్మపేటలో ర్యాలీ నిర్వహించారు. జీప్‌ను మాజీ ఎమ్మెలే తాటి వెంకటేశ్వర్లు స్వయంగా నడిపారు. అనంతరం దమ్మపేట శివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హిందూ ధర్మ సమ్మేళనంలో రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు సంఘటితం కావాలని అన్నారు. భగవద్గీతలోని శ్లోకాలను చదివి, అర్థాలను వివరించారు. స్వామిజీలు, సర్పంచ్ రమాదేవి, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


