వర్సిటీకి నిధులేవి? | - | Sakshi
Sakshi News home page

వర్సిటీకి నిధులేవి?

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

తొమ్మిది నెలలైనా

గతేడాది ప్రారంభమైన

ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ

మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైనా

సీఎం ఆమోదం కోసం నిరీక్షణ

కలెక్టర్‌ కోటా నిధులతోనే

నెట్టుకొస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా ఎర్త్‌ సైన్సెస్‌ విభాగంలో కోర్సులను ఆఫర్‌ చేస్తోంది తెలంగాణకే కాకుండా, దేశానికే తలమానికంగా ఉండేలా అన్ని విధాలుగా వర్సిటీని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య పొంతన కుదరడం లేదు. వర్సి టీ భవనాల మాస్టర్‌ప్లాన్‌ గతేడాది ఆగస్టులోనే సిద్ధం చేశారు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఉష ప్లాన్‌ రూపొందించారు. ఇందులో పాత ఇంజనీరింగ్‌ కాలేజీకి సంబంధించిన క్వార్టర్లు, ఉమెన్స్‌ హాస్టల్‌, అడ్మినిస్ట్రేషన్‌ భవనాలను అలాగే ఉంచారు. కొత్త డిజైన్‌లో పాడుబడిన ఆడిటోరియాన్ని పునరుద్ధరించాలని, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొత్తగా నాలుగు అకాడమిక్‌ బ్లాకులు, సెంట్రల్‌ ఫెసిలిటీ సెంటర్‌, క్యాంటీన్‌, లైబ్రరీల భవనాలకు డిజైన్లు సిద్ధమయ్యాయి. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు పక్కన బాయ్స్‌ హాస్టల్స్‌, డైనింగ్‌ హాల్‌, అకాడమిక్‌ భవనాలకు సమీపంలో గర్ల్స్‌ హాస్టల్‌, డైనింగ్‌ హాల్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.

బడ్జెట్‌ నిధులు ఇంకా రాలేదు

దేశంలోనే ఏకై క ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ప్రాథమికంగా రూ. 500 కోట్ల వరకు ఖర్చు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ 2026–27లో రూ.45 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అంచనా వ్యయంలో దాదాపు పది శాతం నిధులు కేటాయించగా, వర్సిటీ తక్షణ అవసరాలకు పనికి వస్తాయనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపుపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు వర్సిటీ మేనేజ్‌మెంట్‌తో జరగలేదు.

కలెక్టర్‌ కోటానే దిక్కు

యూనివర్సిటీలో తరగతులు ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సి టీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుంచి పైసా విడుదల కాలేదు. కనీ సం సీఎస్‌ఆర్‌ కోటా లో కూడా ఏ ఒక్క కార్పొరేట్‌ కంపెనీ వర్సిటీ ఆధునికీకరణకు ముందుకు రాలేదు. ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటినుంచి ఇప్పటి వరకు వివిధ పనుల కోసం మొత్తంగా రూ.3.20 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా కలెక్టర్‌ కోటా నుంచే వెచ్చించారు. తాజాగా గతంలో మెయింటెనెన్స్‌ లేక బూత్‌బంగ్లాగా మారి న ఆడిటోరియాన్ని రూ.26 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు. త్వరలోనే రెండో ఏడాదికి సంబంధించి డిగ్రీలో నాలుగు కోర్సుల్లో, పీజీలో రెండు కోర్సుల్లో అడ్మిషన్లు జరగుతాయి. మరో మూడు వందల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునే అవకాశం ఉంది. దీంతో క్యాంపస్‌పై ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు దేశంలోనే ఏకై క వర్సిటీ అనే గొప్పలకు తగ్గట్టుగా ఇక్కడ ల్యాబ్‌లను సిద్ధం చేయడం, ఫ్యాకల్టీని నియమించడం వంటి పనులపైనా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది.

ఇండోర్‌ గేమ్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం కేఎస్‌ఎంలోని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఆవరణలో ఇండోర్‌ గేమ్స్‌ కాంప్లెక్స్‌ను హెచ్‌ఓడీ జగన్మోహన్‌రాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉన్న కాంప్లెక్స్‌కు మరమ్మతులు చేయించినట్లు తెలిపారు.

మంత్రి తుమ్మలతోపాటు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ యోగితారాణా ప్లాన్‌ను పరిశీలించి, డిజైన్‌కు ఆమోదం తెలపాల్సిందిగా సీఎం కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని, నిర్మాణ పనులుపూర్తి చేస్తా మని మంత్రి తుమ్మల పలుమార్లు హామీలు ఇచ్చారు. భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచే కాకుండా సింగరేణి, ఎన్‌ఎండీసీ వంటి సంస్థలు, పూర్వ విద్యార్థుల నుంచి కూడా నిధు ల సమీకరణ చేస్తామన్నారు. అయితే, తొమ్మిది నెలలు గడిచినా యూనివర్సిటీ డిజైన్‌కు ఆమోదం రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement