ముత్తంగి అలంకరణలో రామయ్య | - | Sakshi
Sakshi News home page

ముత్తంగి అలంకరణలో రామయ్య

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ టోర్నీలో 11 పతకాలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో జిల్లా అథ్లెట్లు 12 మంది పాల్గొని 11 పతకాలను కై వసం చేసుకున్నారు. రామవరానికి చెందిన ఎస్‌.కే.రియాజ్‌ పాషా, కొత్తగూడేనికి చెందిన బి.పల్లవి, భద్రాచలానికి చెందిన సీహెచ్‌.నిఖిత బంగారు పతకాలు, పాల్వంచకు చెందిన ఎం.సుభాష్‌, రామవరానికి చెందిన ఎస్‌.కే.రియాజ్‌ పాషా, కొత్తగూడేనికి చెందిన సీహెచ్‌.వేదశ్రీ, భద్రాచలానికి సీహెచ్‌.నిఖిత రజత పతకాలు, అశ్వారావుపేటకు చెందిన తాటి సందీప్‌, పాల్వంచకు చెందిన ఎం. సుభాష్‌, కొత్తగూడేనికి ఐ.జయసాయి, మధుప్రియ కాంస్య పతకాలు దక్కించుకున్నారని అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మహీధర్‌ వెల్లడించారు. క్రీడాకారులతో పాటు కోచ్‌లు డి.మల్లికార్జున్‌, పి.నాగేందర్‌లను డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి, అసోసియేషన్‌ బాధ్యులు సారంగపాణి, గొట్టపు రాధాకృష్ణ తదితరులు అభినందించారు.

గిరిజనులందరికీ

లబ్ధి చేకూరాలి

ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం: ప్రతీ గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేవిధంగా అధికారులు పనిచేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి బి.రాహుల్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశం మంది రంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత యూనిట్‌ అధికారులకు అందజేసి, సత్వరమే పరి ష్కరించాలని సూచించారు. అధికారులు డేవిడ్‌రాజ్‌, అశోక్‌, అరుణకుమారి, సైదులు, రాంబాబు, లక్ష్మీనారాయణ, ఉదయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

తెలంగాణ ట్రైకార్‌, భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధి లోని గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. గెస్ట్‌ సర్వీస్‌ అసోసియేట్‌, హోటల్‌ కుకింగ్‌, ఫుడ్‌ బేవరేజ్‌ అసోసియేట్‌, మైక్రో ఇరిగేషన్‌ టెక్నీషియన్‌, వేర్‌ హౌస్‌ అసోసియేట్‌లకు 3 నుంచి 4 నెలల పాటు శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. పదోతరగతి, ఐటీ ఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ చదివి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగినవారు అర్హులని వివరించారు. అభ్యర్థులు ఈ నెల 14న ఇల్లెందులోని వైటీటీ భవనంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

గానుగ నూనె ఆరోగ్యానికి శ్రేయస్కరం

సుజాతనగర్‌: గానుగ నుంచి సేకరించిన వంట నూనె ఆరోగ్యానికి శ్రేయస్కరమని ఐటీడీఐ పీఓ రాహుల్‌ అన్నారు. సుజాతనగర్‌లోని ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. భద్రగిరి మార్ట్‌లో గానుగ నూనె విక్రయిస్తున్నట్లు, ఏజెన్సీ ప్రాంతంలో గానుగ నూనె కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement