ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ వేగవంతం చేయాలి

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం కింద చేపడుతున్న మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అధికా రులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ అంకిత్‌, ఐటీడీఏ పీఓ రాహుల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 74.45 శాతం పూర్తయిందని, రానున్న 15 రోజుల్లో 90 శాతం లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేస్తున్నామని వివరించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎన్నికల సూపరింటెండెంట్‌ రంగా ప్రసాద్‌, నవీన్‌ పాల్గొన్నారు.

బ్యాటరీ వీల్‌ చైర్‌ పంపిణీ

బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు చిలకల నరేష్‌కు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అంకిత్‌ బ్యాటరీ వీల్‌ చైర్‌ అందజేశారు. దివ్యాంగుల సహాయ ఉపకరణాలు కోసం టీజీఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోగా, వీల్‌చైర్‌ మంజూరు చేశారు. అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement