ఇసుక నిల్వలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక నిల్వలపై దాడులు

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

45 ఇసుక డంపులు సీజ్‌

అశ్వాపురం: మండలంలో అక్రమ ఇసుక నిల్వలు, రవాణాపై అధికారులు దాడు లు చేశారు. సోమ వారం పోలీస్‌, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారు లు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీ ల్లో చింత్రియాల క్రాస్‌ రోడ్డు, చింతిర్యాలకాలనీ, సండ్రలబోడు గ్రామాల్లో సుమారు 45 ట్రాక్టర్ల ఇసుక డంపులను గుర్తించి సీజ్‌ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా, తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిచిపోయిన బ్యాగ్‌ అప్పగించిన ఆటోడ్రైవర్‌

ఖమ్మంక్రైం: ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ను డ్రైవర్‌ తిరిగి అప్పగించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వారం గ్రామానికి చెందిన మాలోతు మంజుల వైద్యం కోసం ఖమ్మం వచ్చింది. పాత బస్టాండ్‌లో దిగాక ఆటో లో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా.. హడావుడిలో రూ. 20 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చి పోయింది. కాసేపయ్యాక గుర్తించిన ఆమె ట్రాఫి క్‌ పోలీసులకు ఫిర్యాదుచేయగా, అంతలోనే డ్రైవ ర్‌ కూడా బ్యాగ్‌ యాజమాని గుర్తింపునకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు డ్రైవర్‌కు సమాచా రం ఇవ్వడంతో ఆయన బ్యాగ్‌ను మంజులకు అందజేశాడు. ఈ సందర్భంగా డ్రైవర్‌తో పాటు ట్రాఫిక్‌ సిబ్బందిని సీఐ సత్యనారాయణ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement