పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.25,370 ఆదాయం లభించింది. 210 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.12,632 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం డివిజన్‌స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదివారం ఓ ప్రకటనలో ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భూ సమస్యలు, ఇతర వ్యక్తిగత సమస్యలపై ప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదులతో రావచ్చునని పేర్కొన్నారు.


