ఇల్లెందురూరల్:పిల్లలు పాఠశాల దశలో ఉండగానే భర్త మృతి చెందినా ధైర్యం కూడగట్టుకుని పిల్లలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ చక్కగా చదివించి ఉన్నత స్థానంలో నిలిపింది ఆవుల ఉమారాణి. ఇల్లెందు మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త చనిపోయే నాటికి వారిద్దరు పాఠశాల చదువులోనే ఉన్నారు. ఉమారాణికి తాను చేస్తున్న ఉద్యోగం తప్ప మరే ఆలంబన లేకపోవడంతో పిల్లలు దిగులు చెందారు. వారికి ధైర్యం చెప్పి తండ్రి ఆశయాలు నెరవేర్చాలని నూరిపోసింది. తల్లిమా ట జవదాటకుండా పెద్దకుమార్తె బిందు కౌటిల్య జర్మనీలో ఎంఎస్, చిన్నకుమార్తె హిమకర్షిత హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నారు. మన సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ ఎంతో ఆదర్శప్రాయమని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉమారాణి పేర్కొంది.


