● బి.రోహిత్‌రాజు, ఎస్పీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): అమ్మ తొలి గురువని అంటారు. నా విషయంలో అది అక్షర సత్యం. సహజంగానే పోలీస్ కుటుంబం నుంచి రావడంతో నాలో మొదటి నుంచి మంచి పోలీస్ ఆఫీసర్ కావాలనే తపన ఉండేది. ఈ సంకల్పానికి ఊతమిచ్చింది అమ్మ. నాన్న కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఏఎస్‌ఐగా రిటైర్డ్ అయ్యారు. అమ్మ నన్ను పోలీస్ ఆఫీసర్‌గా చూడాలని కలలు కనేది. నాలో కూడా ఇదే కోరిక బలంగా నాటుకుంది. నా చదువులో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. అనుక్షణం నాకు మనోధైర్యాన్ని ఇస్తూ నేను ఐపీఎస్ కావడానికి ఇచ్చిన సహకారం ఎంతో ఉంది. అందుకే అమ్మమాటను ఎప్పుడు జవదాటే వాడిని కాదు. జన్మనివ్వడమే కాకుండా నాకు మంచిమార్గం చూపుతూ ఈస్థాయికి ఎదగడానికి కారణమైన అమ్మ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.


