●త్యాగానికి ప్రతిరూపం | - | Sakshi
Sakshi News home page

●త్యాగానికి ప్రతిరూపం

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అన్నదమ్ములను ఉమ్మడి కుటుంబంగా చూశాం. కానీ ఇక్కడ అక్కచెల్లెళ్లను ఉమ్మడి కుటుంబంగా ఆదరించిన మాతృమూర్తి గాజునబోయిన బుచ్చమ్మ. ఒంటి పూట భోజనం చేస్తూ ఇప్పటికీ 95 సంవత్సరాల వయసులో కూడా ఇంకా అమ్మ ప్రేమను పంచుతున్నారు. తన చెల్లి 1979లో అనారోగ్యంతో మృతి చెందగా, భర్త కనకయ్య సహకారంతో తన కుమారుడితోపాటు చెల్లికి ఉన్న ముగ్గురు కుమారుల బాధ్యతను భుజాన వేసుకుంది. వారి చదువులు, ఆరోగ్యం విషయంలో ఆస్తులు కోల్పోయింది. తన కుమారుడితోపాటు చెల్లి పిల్లలకు ఎలాంటి తనపర భేదం లేకుండా చదువులు చెప్పించి ప్రయోజకులను చేసింది. అక్ష్యరాస్యత లేకపోయినా అమ్మతనానికి, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement