●అమ్మ చేసే పప్పుచారు.. చాలా ఇష్టం | - | Sakshi
Sakshi News home page

●అమ్మ చేసే పప్పుచారు.. చాలా ఇష్టం

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

● మట్టా హరికుమారి, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అమ్మ చేసే పప్పుచారు అంటే చాలా ఇష్టం. నేను ఎంత ప్రయత్నించినా అంత రుచిగా చేయలేకపోతున్నాను. ఆడపిల్ల పుట్టిందని అమ్మ ఎప్పుడూ చింతించలేదు. నేను ఏ పని చేసినా అమ్మ ఇచ్చిన ధైర్యంతో చేశాను. నాలో పట్టుదల, దృఢ సంకల్పానికి, చదువులో రాణించడానికి, జీవితంలో స్థిరపడటానికి కారణం మా అమ్మే. అందుకే అమ్మను మించి దైవం లేదంటారు. అమ్మ త్యాగాన్ని, గొప్పతనాన్ని వర్ణించలేం. అమ్మ రుణాన్ని తీర్చుకోలేను.

Advertisement
 
Advertisement
Advertisement