ముగిసిన సమ్మర్‌ క్యాంప్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సమ్మర్‌ క్యాంప్‌

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

పాల్వంచరూరల్‌: మండల పరిధిలోని కిన్నెరసానిలోని మోడల్‌స్పోర్ట్స్‌ స్కూ ల్లో పక్షం రోజులుగా నిర్వహిస్తున్న వేసవి క్రీడాశిక్షణ శిబిరం శనివారం ముగిసింది. గత నెల 25న క్యాంప్‌ ప్రారంభించారు. ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఏసీఎంఓ కీసర రమేష్‌ మాట్లాడుతూ శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం.చందు, ఏఎస్‌ఓ ఎస్‌.కొమరం వెంకటనారాయణ, ఎస్‌.నాగేశ్వరరావు, ఎన్‌.బాబూరావు, పీఈటీ అంజి, కోచ్‌లు వాసు, ప్రసా ద్‌, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

11న కొత్తగూడెంలో జాబ్‌మేళా

రుద్రంపూర్‌: నిరుద్యోగులకు ఈ నెల 11న కొత్తగూడెంలోని సీఎస్‌ఐ చర్చి కాంప్లెక్స్‌ (పోస్టాఫీస్‌ ఏరియా) వద్ద జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. కొత్తగూడెంలోని ఫ్యూచర్‌ ఎమర్జింగ్‌ టెక్‌ సొల్యుషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 43 ఉద్యోగా లకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 21 నుంచి 32 సంవత్సరాల వయసు కలిగిన ఐటీఐ, డిగ్రీ, ఇంటర్‌, డిప్లొ మా, ఎంబీఏ చదివిన నిరుద్యోగులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.

నిజాయితీ

చూపిన భక్తుడు

భద్రాచలం: మూడున్నర లక్షల విలువైన బంగారు ఆభరణం దొరికినా దేవస్థానం అధికారులకు అప్పగించి నిజాయితీ చూపాడు ఓ భక్తు డు. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దర్శనానికి రాజమండ్రి నుంచి వీర బ్రహ్మానంద స్వామి వచ్చి, దర్శనం సమయంలో బ్రాస్లెట్‌ను పోగొట్టుకున్నాడు. అది కొత్తగూడేనికి చెందిన వెంకటేశ్వర్లుకు దొరికింది. దీనిని భద్రాచలానికి చెందిన జి.వెంకటేశ్వరరావు సహకారంతో దేవస్థానం అధికారులకు అందించగా, వారు బాధితుడికి అందజేశారు. దొరికిన ఆభరణం అప్పగించినందుకు వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా అభినందించారు.

ధాన్యం కొనుగోళ్లు

వేగవంతం చేయాలి

కలెక్టర్‌ అంకిత్‌

కొత్తగూడెంఅర్బన్‌: ఽదాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు, ఫార్మర్‌ రిజిస్ట్రీ, సెన్సస్‌, విద్యా వారోత్సవాలపై వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అంకిత్‌ హాజరయ్యారు. అనంతరం అధికారుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దన్నారు. ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సెన్సస్‌ కార్యక్రమంపై సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి దిశానిర్దేశం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ విద్యా చందన, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ప్రేమ్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, మార్కెటింగ్‌ శాఖ అధికారి నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement