వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

సుజాతనగర్‌: వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించారు. వార్డులను పరిశీలించారు. వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోగులకు ఇబ్బందుల తలెత్తకుండా చూడాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.

రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో సుజాతనగర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి మాట్లాడారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ఉంటున్నామని, ఇప్పటివరకు ఒక్క గింజ కూడా తరలించలేదని, తూర్పారబట్టే విషయంలో సమస్యలున్నాయని, నల్లపట్టాలు లేవ ని రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్‌ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని తహసీల్దార్‌ కృష్ణ ప్రసాద్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ నర్మద తదితరులు పాల్గొన్నారు.

ఉత్తీర్ణత సాధించాలి

పాల్వంచ: సప్లిమెంటరీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా తరగతులను సద్విని యోగం చేసుకుని ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. శుక్రవారం కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఫెయిల్‌ అయ్యామని నిరుత్సా హ పడొద్దని, ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమైతే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రాష్ట్రంలో సెన్సస్‌–2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ (డీసీఓ) భారతి హోళీకేరి సూచించారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ అంకిత్‌ హాజరై మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సుజాత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement