‘ఓటరు మ్యాపింగ్‌’లో తంటాలు! | - | Sakshi
Sakshi News home page

‘ఓటరు మ్యాపింగ్‌’లో తంటాలు!

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

● 2002 ఓటర్ల జాబితా ఆధారంగా ప్రక్రియ ● ఓటరు జాబితాలో వివాహితల తల్లిదండ్రుల సీరియల్‌ నంబర్లు అడుగుతున్న అధికారులు ● వివరాలు పూర్తిగా చెప్పలేకపోతున్న మహిళలు

నిర్దేశిత సమాచారం సేకరించాలి

● 2002 ఓటర్ల జాబితా ఆధారంగా ప్రక్రియ ● ఓటరు జాబితాలో వివాహితల తల్లిదండ్రుల సీరియల్‌ నంబర్లు అడుగుతున్న అధికారులు ● వివరాలు పూర్తిగా చెప్పలేకపోతున్న మహిళలు

పాల్వంచరూరల్‌: ఓటరు జాబితా పారదర్శకంగా మార్చేందుకు ఎన్నికల సంఘం ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టింది. జాబి తా కచ్చితత్వం కోసం 2002 ఓటరు జాబి తా ఆధారంగా మ్యాపింగ్‌ ప్రక్రి య కొత్తగూడెం నియోజకవర్గంలో నెల రోజులు గా కొనసాగుతోంది. ఈ నెల 16 నాటికి పూర్తిచేయాలని గడువు నిర్దేశించారు. దీంతో బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరుగుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఇటు అధికారులకు, అటు ఓటర్లకు ఇబ్బందులు తప్పడంలేదు. 2002లో ఎక్కడ ఓటు వేశారో గుర్తురాక ఓటర్లు, ఆ వివరాలు పూర్తిగా సేకరించలేక అధికారులకు తలనొప్పిగా మారింది. 2002 నాటి ఓటరు జాబితా కొందరికి అందుబాటులో లేక నాటి వివరాలు ఓటర్లు చెప్పలేక పోతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

పుట్టిన ఊరు ఓటరు జాబితాలో

పేరు లేకపోతే..

పాల్వంచ మండలంలో ఇప్పటివరకు 60శాతం ఓటర్‌ మ్యాపింగ్‌ పూర్తిచేశారు. 2002 తర్వాత పెళ్లి చేసుకుని ఇతర ప్రాంతాల్లో అత్తవారి ఇళ్లకు వెళ్లిన వారి వివరాలు తప్పనిసరిగా నమోదుచేయాలని సూచించా రు. అయితే కొందరు మహిళల పేర్లు అప్ప టి వరకు ఓటర్ల జాబితాలో ఉండకపోవడంతో మ్యాపింగ్‌లో సమస్యలు తలెత్తున్నాయి. తన పుట్టిన ఊరులోని 2002 ఓటర్ల జాబితా లో తల్లిదండ్రుల పేర్లు, సీరియల్‌ నంబర్లు తెలుసుకుని ప్రస్తుత నివాసం ఉంటున్న ప్రాంతంలోని బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల అప్పగించాల్సి ఉంటుంది. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ మండలం, పట్టణ పరిధిలో మొత్తం 90 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 90మంది బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు, 9మంది సూపర్‌వైజర్లు 40 రోజులుగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన వివరాలను సేకరిస్తూ మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

పుట్టిన ఊరి బీఎల్‌ఓలను సంప్రదించాలి

ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తిచేయడానికి అవసరమైన 2002 నాటి ఓటరు జాబితాలు తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా గ్రామ, పట్టణాల్లోని బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన ఓటర్లు తమ పుట్టిన ఊరి బీఎల్‌ఓలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. మ్యాపింగ్‌ ప్రక్రియను తహసీల్దార్‌, డీటీలు, ఆర్‌ఐలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

2002 ఓటరు జాబితా ఆధారంగా జరుగుతు న్న మ్యాపింగ్‌ ప్రక్రియలో నిర్దేశించిన సమాచా రాన్ని సేకరించాలి. ప్రధానంగా పెళ్లి అయిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు తప్పనిసరిగా తమ పుట్టిన ఊరి వివరాలు సమర్పించాలి. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే బూత్‌ల వారీగా మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఓటర్లు బీఎల్‌ఓలకు సహకరిస్తే ఓటరు జాబితా మరింత పాదర్శకంగా ఉంటుంది. ప్రజలు సందేహాలు ఉంటే బీఎల్‌ఓలకు సంప్రదించాలి.

–దారా ప్రసాద్‌, పాల్వంచ తహసీల్దార్‌

Advertisement
 
Advertisement
Advertisement