చుంచుపల్లి: ఆకాశవాణి 90 వసతంతాల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి 3కే వాకథాన్ నిర్వహించగా, కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రోగ్రాం హెడ్ కొలిపాక శంకరరావు మాట్లాడుతూ 1936 ముందు దక్కన్ రేడియోగా ఉన్న రేడి యో కాలక్రమంలో ఆకాశవాణిగా రూపాంత రం చెందిందన్నారు. రామవరం పశు వైద్యులు డాక్టర్ ఆనంద్, పర్యావరణ ప్రేమికుడు నూర్వి రాజశేఖర్, స్టేషన్ సిబ్బంది, రేడియో వ్యాఖ్యాతలు తదితరులు పాల్గొన్నారు.
కో ఆప్షన్ సభ్యుడిపై కౌన్సిలర్ ఫిర్యాదు
ఇల్లెందు: తనకు సమాచారం లేకుండా, ప్రోట్‌కాల్ పాటించకుండా కో ఆప్షన్ సభ్యుడు వ్యవహరిస్తున్నారని 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య(సారిక) శుక్రవారం ఇల్లెందు మున్సి పల్ కమిషనర్ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కౌన్సిలర్ పాత్ర పోషి స్తున్నారని, అక్కడి వార్డు అధికారి కో ఆప్షన్ సభ్యుడి సతీమణి ద్వారా కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ మొదలు ఇందిరమ్మ ఇళ్ల వరకు అన్నింటిలోనూ చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రమాదపు ప్రయాణం
అశ్వారావుపేటరూరల్: తాటి చెట్టు మొద్దుల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌పై ఓ కూలీ కుర్చొని ఉండగా, మరో కూలీ ఆదమరిచి నిద్రిస్తున్నా డు. ఇదేమి పట్టని ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని శరవేగంగా నడుపుతూ దూసుకెళ్తున్నాడు. ఎలాంటి రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న కూలీలు ఏ మాత్రం పట్టుతప్పినా ప్రాణా పాయం తప్పదు. ట్రాక్టర్‌లో లోడు చేసిన తాటి మొద్దులను మోకులతో కట్టాల్సి ఉండగా, కర్రల సాయంతో మొద్దులను తరలిస్తున్నారు. శుక్రవారం మండలంలోని జాతీయ రహదారిపై ఈ దృశ్యం కనిపించింది.


