అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి గురువారం మృతి చెందాడు. కుటుంబీలకు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన మిరియాల కోటేశ్వరరావు(45) వాచ్‌మెన్‌గా పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అశ్వారావుపేట మూడో కిలోమీటర్ సమీపాన ఉన్న కల్వర్టు వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానిక ఆస్పత్రిలో ఆపై ఏపీలోని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ టి.యయాతీ రాజు తెలిపారు.


