భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామ య్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం జరిపించారు. కాగా, మంగళవారం కావడంతో అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకులతో అర్చన నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రూ.1.70లక్షల విలువైన వెండి పళ్లెం
శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి భద్రాచలం వాస్తవ్యులు వెండిపళ్లెంను మంగళవారం వితరణగా అందజేశారు. భద్రాచలానికి చెందిన మద్దాల భవన్‌సాయి మెహర్ 655 గ్రాముల వెండితో రూ.1.70లక్షల విలువైన పళ్లెం చేయించాడు. దీనిని స్వామి వారి పాదాల చెంత పూజల అనంతరం ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అధికారులు కత్తి శ్రీనివాస్, అర్చకులు, దాత కుటుంబీకులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ జిల్లా జట్ల
ఎంపికకు పోటీలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): అథ్లెటిక్స్ జిల్లా జట్లను ఎంపిక చేసేందుకు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో మంగళవారం పోటీలు నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలను రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఓ.సుధాకర్‌రావు ప్రారంభించి మా ట్లాడారు. క్రీడాసాధనతో వ్యక్తిగతంగా ప్రతిభ చాటడమే కాక ఉద్యోగ నియామకాల్లో అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అసో సియేషన్ కార్యదర్శి కె.మహీధర్ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికై న జట్లు 10వ తేదీన హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు. అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డి.మల్లికా ర్జున్, కోచ్‌లు నాగేందర్, ఏ.వందన, ఎస్.కే.రియాజ్‌పాషా పాల్గొన్నారు.
13 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఈనెల 13 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి హెచ్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈమేరకు మంగళవారం వివిధ శాఖల అధికా రులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు రెండేసి సెషన్లలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2–30 నుంచి 5–30 వరకు పరీక్షలు జరగనుండగా జిల్లాలో 6,684 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దీంతో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వేసవి నేపథ్యాన ప్రతీ కేంద్రంలో ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సమకూర్చనున్నట్లు తెలిపారు. త్వరలోనే చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌ఓగా పద్మావతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ)గా ఎస్.పద్మావతి నియమి తులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని స్పోర్ట్స్‌అథారిటీ ఆఫ్ తెలంగాణలో డిప్యూ టేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ గతంలో డీఆర్‌ఓగా పనిచేసిన హౌసింగ్ పీడీ రవీంద్రనాధ్ బదిలీ అయ్యాక ఎవరినీ నియమించలేదు. దీంతో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ డీఆర్‌ఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమేకు పద్మావతిని పూర్తిస్థాయి డీఆర్‌ఓగా నియమించారు.


