పీఏసీఎస్‌ల్లో పాత పాలకవర్గాలకే పగ్గాలు | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌ల్లో పాత పాలకవర్గాలకే పగ్గాలు

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

టేకులపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)కు ఎన్నికలు నిర్వహించే వరకు పాత పాలకవర్గాలనే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. సంఘాల కమిటీలను గత ఏడాది డిసెంబర్‌లో రద్దుచేసిన ప్రభుత్వం పర్సన్‌ ఇన్‌చార్జ్‌ లను నియమించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఇటీవల విచారణ చేపట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించే వరకు గతంలో ఎన్నికై న పాలకవర్గాలనే కొనసాగించాలని ఆదేశించింది. దీంతో జిల్లాలోని 21 పీఏసీఎస్‌ల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగానే టేకులపల్లి మండలం బేతంపూడి పీఏసీఎస్‌ చైర్మన్‌ లక్కినేని సురేందర్‌రావు సైతం పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కె.ఆదినారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించగా, సీఈఓ పొన్నోజు ప్రేమాచారి, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన చైర్మన్‌, వైస్‌చైర్మన్లు

Advertisement
 
Advertisement
Advertisement