భద్రాచలం: వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న క్యాంపుల వలన విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి సాధించవచ్చని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలి కల, వికాసం పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ట్, క్రాఫ్ట్స్, నృత్యం, పాటలు, కంప్యూటర్ శిక్షణ తరగతులను పరిశీలించిన అనంతరం పీఓ మాట్లాడారు. విద్యార్థులోని మేధాశక్తి, ప్రతిభను వెలికితీయడానికి క్యాంప్‌లను నిర్వహిస్తుంగా.. భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ మేరకు పలువురు విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించి అభినందించారు. ట్రైబల్ వెల్ఫే ర్ డీడీ అశోక్, క్యాంప్ ఇన్‌చార్జ్ నాగరాజు, పీడీలు, పీఈటీలు, ఆర్‌పీలు వసంత్, మహాలక్ష్మి, నటరాజ్, విజయలక్ష్మి, నాగలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
జాతర పోస్టర్లు ఆవిష్కరణ
రెండేళ్లకోసారి భద్రాచలంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీలో జరిగే నాయకపోడు తెగ ఇలవేల్పు బాల కొర్రాజుల స్వామి జాతర పోస్టర్లను పీఓ రాహుల్ ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతర జరుగుతుందని పెద్దలు వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు తెల్లం రమణయ్య, పుల్లయ్య, మారయ్య, కొండయ్య, లక్క రామకృష్ణ, పాశం భరత్, జమ్మల శ్రీను, ముర్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


