పాల్వంచ: ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలని, నిరంతర పోరా టాలతోనే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ లక్ష్మీ బాంకెట్ హాల్‌లో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించగా.. కూనంనేని పాల్గొని మాట్లాడారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కమ్యూనిస్ట్ కార్యకర్తలు లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మతోన్మాద శక్తులు బలపడుతున్న తరుణంలో లౌకిక వాదాన్ని కాపాడుకోవాలని సూచించా రు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు ఉధృతం చేయాలన్నా రు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అప్పుడే బలమైన శక్తిగా ఎదగలమని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, సార య్య, సలిగంటి శ్రీను, మున్నా లక్ష్మీకుమారి, అడుసుమల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, కంచర్ల జమలయ్య, మురళి, వెంకటేశ్వర్లు, భాస్కర్, దస్రు, రాహుల్, వెంకటేశ్వర్లు, ఫహీం, శంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


