దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల గ్రామంలో సీతమ్మసాగర్ భూనిర్వాసితులతో మంగళవారం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణంలో మూడో ఫేజ్‌కు సంబంధించి భూములు కోల్పోతున్న ఎల్‌ఎన్‌రావుపేట, పెద్దబండిరేవు గ్రామాలకు చెందిన రైతులు తమ భూములకు రూ.30 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా సబ్ కలెక్టర్ ఏజెన్సీలోని ప్రభుత్వ ధర ప్రకారం రూ. 11.50 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. రైతులు ఒప్పుకోకపోవడంతో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని, కలెక్టర్ మరోసారి గ్రామసభ నిర్వహించడానికి సమయం ఇస్తారని సబ్ కలెక్టర్ రైతులకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్, ఇరిగేషన్ డీఈ తాటి నాగేశ్వరరావు, డీఏఓ రాజేంద్రకుమార్, సర్పంచ్ బాగే ఖాదర్‌బాబు, ఆర్‌ఐలు కల్లూరి వెంకటేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


