ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

ఇల్లెందురూరల్‌: ఆయిల్‌పామ్‌ సాగుతో ఏళ్ల తరబడి రైతులకు ఆశించిన మేర లాభాలు ఉంటాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు మంగళవా రం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఇల్లెందు మండలం సుదిమళ్ల రైతువేదికలో ఉద్యాన పంటల సాగుపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అత్యధికంగా వంట నూనెల దిగుబడినిచ్చే పంటల్లో ఆయిల్‌పామ్‌ ప్రధానమైనదని చెప్పారు. ఎకరం వరిసాగుకు అవసరమయ్యే నీటితో మూడెకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయొచ్చని తెలిపారు. ఈ మేరకు మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా రైతులు దృష్టి సారించాలని చెప్పారు. ఈ పంట సాగు చేస్తే నిర్వహణ, అంతర్‌పంటల సాగుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ఇస్తుందని వెల్లడించారు. మార్కెట్‌ చైర్మన్‌ బానోత్‌ రాంబాబు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొడ్డ కిరణ్‌మిత్ర, సర్పంచ్‌లు శారద, మంగమ్మ, సాయమ్మ, ఏడీఏ లాల్‌చంద్‌, ఏఓలు సతీశ్‌, అన్నపూర్ణ, ఎంపీడీఓ ధన్‌సింగ్‌, ఎంపీఓ చిరంజీవి, ఉద్యాన అధికారి స్రవంతి, ఆత్మకమిటీ చైర్మన్‌ మంగీలాల్‌, ఏఈఓలు పాల్గొన్నారు.

డీఏఓ బాబూరావు

Advertisement
 
Advertisement
Advertisement