భద్రాచలం: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. రెవెన్యూ సమస్యలు, పింఛన్లు తదితర సమస్యలు, వివిధ సంక్షేమ పథకాల కోసం అర్జీలు పెట్టుకున్నారని చెప్పారు. భద్రాచలం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, డీఏఓ రాజేంద్రనాథ్, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు..
సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట


