రాష్ట్ర స్థాయి పోటీల్లో ‘కనకం’ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీల్లో ‘కనకం’

Feb 22 2026 7:17 AM | Updated on Feb 22 2026 7:17 AM

రాష్ట్ర స్థాయి పోటీల్లో ‘కనకం’

రాష్ట్ర స్థాయి పోటీల్లో ‘కనకం’

దమ్మపేట: ఖమ్మంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన కనకం లోహితశ్రీ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది. హైదరాబాద్‌లోని క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న లోహితశ్రీ బాలికల విభాగంలోని అర్చరీ పోటీల్లో రికర్వ్‌ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ మేరకు శనివారం ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోగా, నాయకులు కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, కూరం అర్జునరావు, బొల్లికొండ నాగేశ్వరరావు తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement