పుర పోరుకునగారా
కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఈ మేరకు ఈసీ మంగళవారం షెడ్యూల్ ప్రకటించగా అధికారులు పోలింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా విడుదల చేయగా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది.
–కొత్తగూడెంఅర్బన్/ఇల్లెందు/అశ్వారావుపేట
పోలింగ్
11న ఉ.7 నుంచి
సా. 5 గంటల
వరకు
ఓట్ల లెక్కింపు
13న ఉదయం
8 గంటల నుంచి
చకచకా ఏర్పాట్లు..
జిల్లాలోని ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనే అనుమానాలు అందరిలో కలిగాయి. ఇక కార్పొరేషన్‌లో విలీనమైన పాల్వంచ మున్సిపాలిటీ ఏజెన్సీనా, నాన్ ఏజెన్సీనా అనే అంశంపైనా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, కార్పొరేషన్‌లో కలపడం సరైంది కాదని మరి కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహిస్తూ షెడ్యూల్ విడుదల కావడంతో మిగిలిన ప్రక్రియ చకచకా సాగుతోంది. 27 ఏళ్ల తర్వాత పాల్వంచలో ఎన్నికలు జరుగుతుండగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డివిజన్లు, ఓటర్ల వివరాలు..
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లకు గాను కొత్తగూడెంలో 29, పాల్వంచలో 27, సుజాతనగర్ మండలంలో నాలుగు ఉన్నాయి. ఈ డివిజన్లలో 1,34,775 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 64,431, మహిళలు 70,314, ఇతరులు 30 మంది ఉన్నారు. ఇక్కడ మొత్తంగా 201 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉండగా 33,723 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 16, 222 మంది, మహిళలు 17,497 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. ఇక్కడ 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో మొత్తం 16,850 మంది ఓటర్లకు గాను పురుషులు 8,084, మహిళలు 8,762 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో 22 డివిజన్లకు గాను 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నామినేషన్ స్వీకరణ కేంద్రాలివే..
మున్సిపల్ ఎన్నికలకు బుధవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో 11, పాల్వంచ డివిజన్ కార్యాలయంలో 9, సుజాతనగర్‌లో రెండు కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఇల్లెందులో 1 నుంచి 6 వార్డులకు గోవింద్ సెంటర్‌లోని పంచాయతీరాజ్ డీఈఈ కా ర్యాలయం, 7 నుంచి 15 వార్డులకు ఎంపీడీఓ కార్యాలయం, 16 నుంచి 24వ వార్డు వరకు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అశ్వారావుపేటలో 1 నుంచి 7వ వార్డు వర కు మున్సిపల్ కార్యాలయం, 8, 9, 13, 14,15, 16, 18వార్డులకు ఎంపీడీఓ కార్యాలయం, 10, 11,12, 17,19,20,21,22 వార్డులకు మిషన్ భగీరథ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు.
అభ్యంతరాల
పరిష్కారం
2వ తేదీ
సాయంత్రం
5 గంటల లోపు
బరిలో ఉన్న
అభ్యర్థుల ప్రకటన
3న సాయంత్రం3 గం. తర్వాత
పుర పోరుకునగారా
పుర పోరుకునగారా


