మాయదారి మాంజా.. | - | Sakshi
Sakshi News home page

మాయదారి మాంజా..

Jan 12 2026 7:40 AM | Updated on Jan 12 2026 7:40 AM

మాయదా

మాయదారి మాంజా..

కంటికి కనిపించక ప్రమాదాలు

సంక్రాంతి వేళ పొంచి ఉన్న ముప్పు

విస్తృత అవగాహన కల్పిస్తున్న

అధికారులు

అవగాహన కలిస్తున్నాం..

కంటికి కనిపించకుండా..

సంక్రాంతి పండగ వచ్చిందంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో కొందరు వ్యాపారులు చైనా మాంజాను ఎక్కడెక్కడి నుంచో తెప్పించి మనుషుల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. గాలి పటాలు ఎగరేసినప్పుడు తెగిపోయిన మంజా దారాలు చెట్లు, కరెంట్‌ తీగలు, స్తంభాలు, ఇళ్ల మధ్య వేలాడుతుండడంతో పక్షులూ మృత్యువాతపడుతున్నాయి. మనుషులు సైతం మాంజా తగిలి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నా సరే కంటికి కనిపించకుండా మాంజా దారాలు తగిలి ప్రమాదాల బారిన పడుతున్నా మార్కెట్‌లో వీటి విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు.

మాంజాపై ఉక్కుపాదం

జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో యువకులు, చిన్నారులు పతంగులు ఎగురవేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే గాలిపటాలు ఎగరవేసేటప్పుడు చైనా మాంజాకు బదులుగా స్థానికంగా ప్రమాదరహిత రసాయనాలు, ముడివస్తువులతో తయారు చేసే లోకల్‌ మాంజాను వినియోగించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక ప్రమాదకరమైన మాంజాను విక్రయించొద్దని ఈ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 2016లో నిషేధం కూడా విధించింది. ఈమేరకు ఒకవైపు అటవీశాఖ, పోలీసుశాఖలు విక్రయించొద్దని హెచ్చరిస్తున్నా, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నా.. కొందరు వ్యాపారులు అధికారుల కళ్లు కప్పి మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది.

మరింత ప్రమాదం..

చైనా మాంజా తయారీలో గాజు పొడి, నైలాన్‌న్‌, సింథటిక్‌ దారాలు, హానికరమైన రసాయనాలను వాడుతుంటారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, మరింత పదునుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మాంజా వల్ల జంతువులు, పక్షులు, మనుషులు కూడా గాయపడిన సంఘటనలు లేకపోలేదు. కాబట్టి చైనా మాంజా వాడాకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలని అధికారులు, పర్యావరణ పరిరక్షకులు సూచిస్తున్నారు. చైనా మాంజాను విక్రయించినా, కొన్నా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం ఈ మాంజాలను విక్రయించిన వారికి రూ.లక్ష జరిమానా, 5 నెలలు జైలు శిక్ష విధిస్తారని హెచ్చరిస్తున్నారు.

సంక్రాంతి పండుగకు గాలిపటాలను ఎగురవేసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. దీని కోసం పలు ప్రాంతాల నుంచి రకరకాల మాంజాలను తెప్పిస్తుంటారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు దృఢంగా ఉండే చైనా మాంజాను విక్రయిస్తుంటారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ మాంజా చుట్టుకుని పక్షులు, మూగజీవాలతో పాటు మనుషులూ అక్కడక్కడా ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రతీ సంక్రాంతికి జిల్లాలో ఏదో ఒక మూలన ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతుండడంతో వీటికి అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతో అటవీశాఖ, పోలీస్‌ శాఖ విస్తృత తనిఖీలతో పాటు యువకులకు అవగాహన కల్పిస్తున్నారు. – చుంచుపల్లి

యమపాశాలుగా

మారుతున్న చైనా మాంజా

పతంగులు ఎగరేసే యువకులు నిషేధిత చైనా మాంజా వాడకూడదు. ఎవరైనా మాంజా విక్రయాలు చేపట్టినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. వీటిని వాడకుండా అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, పోలీసులతో తనిఖీలు కొనసాగుతున్నాయి. – కిష్టాగౌడ్‌, డీఎఫ్‌ఓ

మాయదారి మాంజా..1
1/2

మాయదారి మాంజా..

మాయదారి మాంజా..2
2/2

మాయదారి మాంజా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement