నిజాయతీగా పాలన అందిస్తా..
తొలి ప్రయత్నంలోనే సర్పంచ్‌గా ఎన్నికవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎంబీఏ పూర్తి చేశాను. గ్రామంలోని యువత అందరి ప్రోత్సాహంతో అవినీతికి తావు లేకుండా నిజాయతీగా పాలన అందిస్తా. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మహనీయులు చెప్పిన మాటలు నిజం చేసే దిశగా తొలి అడుగు వేశాను. వచ్చే ఐదేళ్లలో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, డ్రెయినేజీలు, అంతర్గత సిమెంట్‌రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తా. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు సాయశక్తుల కృషి చేస్తా. – బొడ్డు రోజాలక్ష్మి,
సర్పంచ్, బుగ్గపాడు, సత్తుపల్లి మండలం


