సేవా స్ఫూర్తితో ముందుకు..
ప్రజాసేవలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేసిన నా మామయ్య, మాజీ సర్పంచ్ తమ్మినేని నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. బీటెక్ పూర్తి చేసిన నేను ఆధునిక విధానాలు, కొత్త ఆలోచనలతో గ్రామాభివృద్ధికి పాటుపడి గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా చూస్తాను. నిధులను సద్వినియోగం చేస్తూ.. పాలక మండలి సభ్యులను సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. – తమ్మినేని ప్రియాంక,
చింతగుర్తి సర్పంచ్, రఘునాథపాలెం మండలం


