వనరుల సద్వినియోగమే లక్ష్యం
నా భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన సేవాగుణం స్ఫూర్తితో టీటీసీ పూర్తి చేసిన నేను పజ్రలకు సేవా చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. సింగరేణి షేప్ నిధులతో గ్రామంలో రహదారులు, భవనాలు నిర్మించారు. ప్రభుత్వం మంజూరు చేసే ప్రతీ పైసా గ్రామస్తులకు ప్రయోజనం చేకూర్చేలా వార్డు సభ్యులు, గ్రామపెద్దల సలహాలతో సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. యువత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రతీ గ్రామసభకు వారిని ఆహ్వానించి మేథావులతో వారిలో చైతన్యం కల్పిస్తాం. – భూక్య అనూష,
రొంపేడు సర్పంచ్, ఇల్లెందు మండలం


