సామాజిక మార్పునకు యువతే శక్తి
ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న నేను యువతే సామాజిక మార్పుకు శక్తి అన్న నమ్మకంతో ప్రజాసేవ కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. ఎలాంటి పైరవీలు, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను. బుగ్గవాగుపై వంతెన నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడంతో పాటు మంత్రి తుమ్మల, మండల అధికారుల సహకారంతో పెద్దగా గుర్తుంపులేని మా గ్రామానికి ప్రత్యేకత చాటేలా ప్రయత్నిస్తా. – భూక్యా రమణ,
వీఆర్ బంజర్ సర్పంచ్, రఘునాథపాలెం మండలం


