యువోత్సాహం..
ఉరకలెత్తిన
● గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకం ● ఉమ్మడి జిల్లాలో సర్పంచ్‌లుగా పలువురు విద్యావంతుల ఎన్నిక
నేడు స్వామి వివేకానంద జయంతి
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అంటారు. అలాంటి పల్లెల అభివృద్ధి
చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామాలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే సర్పంచ్‌లు, పాలక మండళ్ల పాత్ర కీలకం. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో యువతీ యువకులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అందులోనూ పలువురు ఉన్నత విద్యావంతులు ఉండడం విశేషం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేడు యువజన దినోత్సవం నిర్వహిస్తున్న క్రమంలో యువ సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడతారు, వారికి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభించిందనే వివరాలు వారి మాటల్లోనే. – సాక్షి నెట్‌వర్క్


