వరి గడ్డివాము దగ్ధం
టేకులపల్లి: మండంలోని బోడు గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గడ్డివాము దగ్ధమైంది. బాధితుల కతనం ప్రకారం.. బోడు గ్రామంలో రైతు ఆడెపు శ్రీను ఇంటి వద్ద 800 కట్టల గడ్డి వాము నిల్వ చేశారు. ఆదివారం అనుకోకుండా గడ్డివాముకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఆరకపోవడంతో ఇల్లెందు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. అప్పటికే 600లకు పైగా గడ్డికట్టలు కాలిపోయాయని, సుమారు రూ.60వేలు వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.
ఇసుక ట్రాక్టర్‌ను పట్టించిన స్థానికులు
పాల్వంచరూరల్: తెల్లవారుజామున కిన్నెరసానివాగు లోనుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని రంగాపురంలో చోటుచేసుకుంది. మండలంలోని రంగాపురం శివారులో కిన్నెరసాని వాగు నుంచి ఆదివారం తెల్లవారుజామున ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్థానికులు గమనించి అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారు రాగానే ట్రాక్టర్‌ను అప్పగించారు. కాగా, ఇసుక తరలిస్తున్న భూక్యా శివశంకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
జూలూరుపాడు: మండలంలోని సురారం గ్రామంలో ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలూరుపాడు ఏఎస్సై గజ్జల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ నాగరాజు(38), భార్య పద్మతో ఉన్న మనస్పర్థల కారణంగా గత కొంతకాలంగా నాగరాజు సురారంలోను, భార్య పడమటనర్సాపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నాగరాజుకు ఉన్న వ్యక్తిగత సమస్యలు, ఒంటరితనాన్ని భరించలేక మనోవేదనకు గురై గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై సమగ్రస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని మృతుడి తల్లి బానోత్ జమ్మ పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
వరి గడ్డివాము దగ్ధం
వరి గడ్డివాము దగ్ధం


