● బతుకుబండి సాగుతోంది..
పాత బైక్‌తో ఐస్ క్రీమ్ వ్యాపారం
కరకగూడెం: కష్టపడి పనిచేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. సృజనాత్మకతతో పాత ద్విచక్రవాహనం ముందు భాగంలో ఉండే చక్రాన్ని తొలగించి దాని స్థానంలో రెండు చక్రాల ఐస్ క్రీమ్ బండిని అమర్చుకొని ఊరూరు తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు. రంగురంగుల కాగితాలు, బొమ్మలతో బండిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి రోజుకు మంచి ఆదాయం పొందుతున్నాడు. ఈ యువకుడి కృషిని అందరూ అభినందిస్తున్నారు.


