పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి

Apr 10 2025 12:48 AM | Updated on Apr 10 2025 12:48 AM

పూర్త

పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి

సింగరేణి డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు

మణుగూరు టౌన్‌: పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని డైరెక్టర్‌(ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్‌) వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం ఆయన జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి కొండాపురం భూగర్భ గనిని సందర్శించారు. బంకర్‌ను, మ్యాన్‌రైడింగ్‌ సిస్టం ద్వారా గనిని సందర్శించి పరిశీలించారు. జియోలాజికల్‌ కండీషన్స్‌, రక్షణ తదితర అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యాన్‌ పవర్‌, యాంత్రిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటేశ్వర్లు, వీరభద్రరావు, శ్యాంసుందర్‌, ఆర్‌.శ్రీనివాస్‌, వెంకట్రావ్‌, వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఈద్‌ మిలాప్‌

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్‌షాపులో బుధవారం ఈద్‌మిలాప్‌ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్క్‌షాపు ఇన్‌చార్జ్‌ శ్రీకాంత్‌, ఏరియా ఉపాధ్యక్షుడు రజాక్‌, కేశవరావు, యోహాన్‌, అబ్దుల్‌ బాసిత్‌, అబ్దుల్‌ సలాం, ఎ.ఉపేందర్‌బాబు, సత్తార్‌, పలువురు ముస్లింలు పాల్గొన్నారు.

దాహార్తి తీరుస్తున్న చలివేంద్రాలు

పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు

చుంచుపల్లి: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో తగిన రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు, బయటకు వచ్చిన వారు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తాగునీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అన్ని గ్రామాలు, వార్డుల్లోనూ పూర్తిస్థాయిలో చలివేంద్రాలను అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

అంబులెన్స్‌లో ప్రసవం

టేకులపల్లి: మండలంలోని రామచంద్రునిపేట పంచాయతీ పాతర్లగడ్డ గ్రామానికి చెందిన మమతకు పురిటినొప్పులు రావడంతో 108లో అంబులెన్స్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. నొప్పులు అధికం కావడంతో మార్గమధ్యలోనే కాన్పు పొందింది. ఈఆర్‌సీపీ డాక్టర్‌ శివ సలహా మేరకు ఆశా వర్కర్‌తోపాటు ఈఎంటీ పూర్ణచందర్‌, పైలట్‌ శ్రీనివాసరావు సేవలందించారు. ఆడ బిడ్డ జన్మించిందని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంఈటీ తెలిపారు.

దుక్కిటెద్దు మృతి

జూలూరుపాడు: మండలంలోని కరివారిగూడెం గ్రామంలో దుక్కిటెద్దు మొక్కజొన్న కంకులు తిని అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ రైతు సీడ్‌ మొక్కజ్నొ పంటను సాగు చేశాడు. పంట చేతికి రావడంతో మూడు రోజుల క్రితం రైతు కంకులు విరిచి, అక్కడక్కడా కంకులు విరవకుండా వదిలేశారు. మొక్కజొన్న పొలంలోకి మేత కోసం వెళ్లిన భూక్య తిరుపతయ్య అనే రైతు దుక్కిటెద్దు రెండు రోజులుగా కంకులు తినడంతో అనారోగ్యానికి గురైంది. పశువైద్యాధికారితో చికిత్స అందించినా చనిపోయినట్లు బాఽధిత రైతు తెలిపాడు. రూ.60 వేలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

ఆటో బోల్తా

ముగ్గురు మహిళలకు గాయాలు

పాల్వంచరూరల్‌: ఆటో బోల్తా పడి ముగ్గురు మహిళలు గాయపడ్డ ఘటన బుధవారం జరిగింది. మండల పరిధిలోని నర్సింహాసాగర్‌ గ్రామానికి చెందిన లక్ష్మ, అనూష, కనకమ్మలు తునికి కాయలను విక్రయించడం కోసం ఆటోలో పాల్వంచ వస్తున్నారు. ఈ క్రమంలో ఉల్వనూరు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి1
1/2

పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి

పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి2
2/2

పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement