రైతులకు ప్రత్యేక బడ్జెట్ తేవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా వ్యవసాయ రంగం దిబ్బతిని సంక్షోభంలో ఉందని ఆవేదనవ్యక్తం చేశారు. స్వామినాథన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మిర్చి క్వింటాకు రూ.25 వేలు చెల్లించాలి, పత్తికి రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. అనాదిగా పోడుసాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్, జిల్లా నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, నరాటి రమేష్, సపావట్ రవి, విజయలక్ష్మి, సుబ్బారెడ్డి, బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా


