ముగిసిన ‘పది’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: గత నెల 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి తెలిపారు. చివరి రోజు సోషల్ పరీక్షకు 12,273 మంది విద్యార్థులకు 12,240 మంది హాజరయ్యారని, 33 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. సప్లిమెంటరీ విద్యార్థులు 26 మందికి 17 మంది హాజరయ్యారని తెలిపారు. తాను రెండు కేంద్రాల్లో, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆరు సెంటర్లలో, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది 26 కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు వివరించారు. జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ఏడు కేంద్రాల్లో గురువారం ఒకేషనల్ పరీక్ష జరుగుతుందని తెలిపారు.


