● జిల్లాలో ఏడు కేంద్రాల్లో 53 యంత్రాలు ● ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 248 మంది ● మరో 170 మందికి సేవలందించే అవకాశం
ఇల్లెందు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏడు కేంద్రాల్లో డయాలసిస్ సౌకర్యం కల్పించారు. గతంలో డయాలసిస్ చేయాలంటే పైరవీలు చేయాల్సి వచ్చేది. లేదంటే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేవారు. బాధితులు వారంలో రెండు నుంచి నాలుగు దఫాలు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారికే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం జిల్లాలోని ఏడు ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అవసరమైన వారందరికీ సేవలు అందుతున్నాయి. ఖాళీ బెడ్లు కూడా ఉంటున్నాయి. కొత్తగూడెం సర్వజన ఆస్పత్రి, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్, చర్ల, పాల్వంచ సీహెచ్‌సీలలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలలో డయాలసిస్ సేవలు అందిస్తున్నాం.ప్రస్తుతం 248 మంది సేవలు పొందుతుండగా, ఇంకా 170 మంది రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి.
–డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్‌ఎస్
డయాలసిస్ సెంటర్‌లు, యంత్రాలు, ఖాళీల వివరాలు..
సెంటర్ పేరు యంత్రాలు బాధితులు ఖాళీలు
జీజీహెచ్, కొత్తగూడెం 10 44 40
ఏరియా ఆస్పత్రి, భద్రాచలం 10 60 25
సీహెచ్‌సీ, పాల్వంచ 10 41 20
ఏరియా ఆస్పత్రి, ఇల్లెందు 08 32 25
ఏరియా ఆస్పత్రి, మణుగూరు 05 32 10
సీహెచ్‌సీ, చర్ల 05 10 30
ఏరియా ఆస్పత్రి, అశ్వారావుపేట 05 29 20
మొత్తం 53 248 170
డయాలసిస్ సేవలు మెరుగు