‘గేట్‌’లో ర్యాంక్‌ సాధించడంపై హర్షం | - | Sakshi
Sakshi News home page

‘గేట్‌’లో ర్యాంక్‌ సాధించడంపై హర్షం

Published Sun, Mar 23 2025 12:13 AM | Last Updated on Sun, Mar 23 2025 12:12 AM

పాల్వంచ: జాతీయస్థాయిలో నిర్వహించిన గేట్‌–2025 కాంపిటేటివ్‌ పరీక్షలో స్థానిక అనుబోస్‌ మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో (మైనింగ్‌) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న టి.దీపిక ఆల్‌ ఇండియాలో 602 ర్యాంక్‌ సాధించింది. శనివారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ టి.భరత్‌కృష్ణ, సెక్రటరీ డాక్టర్‌ ఎ.అవని దీపికను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌వీ సుబ్బారావు, ప్రిన్సిపాల్‌ బి.రవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జమిలీ ఎన్నికలు చారిత్రక అవసరం

పాల్వంచరూరల్‌: జమిలీ ఎన్నికలు జరపడం ఈ దేశానికి చారిత్రక అవసరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌.. బీజేపీ దృష్టికోణం’అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించగా బైరెడ్డి మాట్లాడారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షడు రంగాకిరణ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజుతోపాటు చింతలచెరువు శ్రీనివాసరావు, రాపాక రమేశ్‌, కుంజా ధర్మ, బాలునాయక్‌, పైడిపాటి రవీందర్‌, గొడుగు శ్రీధర్‌, చందు, జల్లారపు శ్రీనివాస్‌, పసుమర్తి సతీశ్‌, పున్నం భిక్షపతి పాల్గొన్నారు.

పర్ణశాల వేలం పాటలు ఖరారు

దుమ్ముగూడెం: పర్ణశాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పార్కింగ్‌, బోట్‌ షికారు, మరుగుదొడ్ల నిర్వహణకు శనివారం వేలంపాట నిర్వహించారు. ఎంపీఓ, పంచాయతీ ప్రత్యేకాధికారి బద్ధి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సంపతి శ్రీనివాసరావు సమక్షంలో తొలుత బోట్‌ షికారు వేలం పాట నిర్వహించారు. గోవిందాపురం గ్రామానికి చెందిన తెల్లం భీమరాజు రూ.44,40,000కు దక్కించుకున్నాడు. గతేడాది ఇది రూ.42,40,000కు దక్కగా.. ఈ ఏడాది రూ.2 లక్షలు లాభం వచ్చింది. వాహన పార్కింగ్‌ పాటను పొడియం వెంకటరమణ రూ.61లక్షలకు దక్కించుకున్నాడు. గతేడాది పార్కింగ్‌ రూ.40లక్షలకు దక్కగా ఈ ఏడాది రూ.21 లక్షలు అదనంగా వచ్చాయి. మరుగుదొడ్ల నిర్వహణ పాటను జానకీరామ్‌ రూ.85 వేలకు దక్కించుకున్నాడు. గతేడాది రూ.1లక్ష 5 వేలకు వెళ్లింది. వేలం పాటలతో పంచాయతీకి రూ.1,06,25,000 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

పెరుగుతున్న మలేరియా కేసులు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో 20 రోజులుగా మలేరియాతో బాధపడుతూ చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అందులో అందరూ చిన్నారులుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 25 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా, 42 మంది ఇతర జ్వరాలతో చేరారు. మలేరియా బాధితుల్లో చిన్నారులే అధికంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినవారిలో 4 శాతం రక్తం ఉండటం లేదా, ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల నుంచి 30 వేలకు పడిపోయిన తరువాత ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఐదు రోజులపాటు వైద్యం అందించి, ఇంటికి పంపిస్తున్నామని వారు చెప్పారు. ఇదే వైద్యానికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.30 వేల వరకు ఖర్చు అవుతోందని సమాచారం. సకాలంలో రోగాన్ని గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చిన్నారుల ప్రాణాల కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

‘గేట్‌’లో ర్యాంక్‌  సాధించడంపై హర్షం 1
1/3

‘గేట్‌’లో ర్యాంక్‌ సాధించడంపై హర్షం

‘గేట్‌’లో ర్యాంక్‌  సాధించడంపై హర్షం 2
2/3

‘గేట్‌’లో ర్యాంక్‌ సాధించడంపై హర్షం

‘గేట్‌’లో ర్యాంక్‌  సాధించడంపై హర్షం 3
3/3

‘గేట్‌’లో ర్యాంక్‌ సాధించడంపై హర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement