ములకలపల్లి : బెల్టుషాపులు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులపై ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మండలంలోని మూకమామిడి, ముత్యాలంపాడు, జగన్నాథపురం, రాజాపురం గ్రామాల్లో దాడులు చేసి రూ. 30 వేల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు.
జూలూరుపాడు: మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన లావుడ్యా రమేష్ ఆదివారం ద్విచక్రవాహనంపై అక్రమంగా 15 మద్యం బాటిళ్లు తరలిస్తుండగా ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. మద్యంను సీజ్ చేసి, నిందితుడిపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు కొత్తగూడెం ఎకై ్సజ్ సీఐ జయశ్రీ, ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు.