ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Nov 11 2026 1:13 AM | Updated on Nov 11 2026 1:13 AM

● అర్నబ్‌, మురసు తుపానులతో దెబ్బతిన్న పంటలు, ఆస్తి నష్టంపై యుద్ధప్రాతిపదికన అధికారులు సర్వే చేపట్టాలని, డ్రైన్‌, వ్యవసాయ, ఉద్యాన, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ● కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన శాసనమండలి ఎన్నికలకు సంబంధించి అర్హులైన వారి ఓటర్ల జాబితాపై నమోదైన దరఖాస్తులను పరిశీలించి గుంటూరుకు పంపించాలని కలెక్టర్‌ తెలిపారు. 6,7,8 ఫామ్స్‌– పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బాపట్ల: జిల్లాలో ఎంపీపీలు, జెడ్పీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ బంగ్లా నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు, ఆర్నాబ్‌, ముసరు తుపాన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జేసీ, జెడ్పీ సీఈఓ, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 19న మండల పరిషత్‌లో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు, 20న జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని తెలిపారు. తొలుత ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్పీల్లో ఇద్దరు చొప్పున కో–ఆప్షన్‌ సభ్యులను నియమించడం జరుగుతుందన్నారు. ముందుగా ఎంపీపీ ఎన్నిక పూర్తియైన తర్వాత వైస్‌ ఎంపీపీ ఎన్నిక జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్‌ లో జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక, అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుందన్నారు. వీరి ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు.

నష్టాలను గుర్తించడంపై రూపొందించిన మార్గదర్శకాలను అధికారులు పక్కాగా పాటించాలని తెలిపారు. నష్టపోయిన పేదలు, రైతులకు ఏమాత్రం అన్యాయం జరగడానికి వీలులేదన్నారు. దెబ్బతిన్న పేదల గృహాలు, ఆస్తి, పంటల నష్టాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది స్పష్టంగా నమోదు చేయాలన్నారు. నివాస గృహాలు దెబ్బతింటే, వాటి ఫొటోలతో సహా వివరాలు నమోదు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారి బ్యాంకు ఖాతాలు, వివరాలు పంపాలన్నారు. జిల్లాలో వరి, ఉద్యాన పంటలు ఎన్ని హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయో ప్రాథమిక నివేదిక అందజేయాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

జిల్లాలో పక్కాగా జనగణన...

బాపట్ల: జిల్లాలో జనాభా గణన ప్రక్రియను ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో రెండో విడత జనాభా గణనకు సంబంధించి రెవెన్యూ డివిజనల్‌ అధికారులు (ఆర్డీఓలు), మండల తహసీల్దార్లకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జనాభా గణనలో జిల్లాలో ఏ ఒక్క వ్యక్తి మిస్‌ కాకుండా ప్రతి ఒక్కరి వివరాలను బాధ్యతాయుతంగా సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, డీపీఓ నరేష్‌ కుమారి, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు ఎ.హరి కుమార్‌, నరసింహారావు, బి.శ్రీదేవి, సీపీఓ ఏఎస్‌ రాజు, జిల్లా కో–ఆర్డినేటర్‌ రవీంద్ర రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓల పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement