కార్తికం.. శివోహం..! | - | Sakshi
Sakshi News home page

కార్తికం.. శివోహం..!

Nov 11 2026 1:13 AM | Updated on Nov 11 2026 1:13 AM

నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.6500, మోడల్‌ ధర రూ.5000 వరకు పలికింది. నరసరావుపేట రూరల్‌: కార్తిక మాసం తొలిరోజు మంగళవారం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. స్వామి వారి తొలి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. అయ్యప్ప, శివయ్య మాలధారులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న రావిచెట్టు, నాగేంద్రుని పుట్ట, మహానందీశ్వరుడి వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. సోపాన మార్గం నుంచి మెట్ల పూజ చేసుకుంటూ కొండ మీదకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి మూలవిరాట్‌ అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ డి.చంద్రశేఖర్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

నిమ్మకాయల ధరలు
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.6500, మోడల్‌ ధర రూ.5000 వరకు పలికింది.

అమరేశ్వరాలయంలో భక్తుల సందడి..

అమరావతి: ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వ రస్వామి ఆలయంలో మంగళవారం కార్తికమాసం ప్రారంభం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం వేకువజామునుంచే అమరేశ్వరుని దర్శించుకున్నారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో కార్తిక స్నానాలు చేసి ఆలయంలో కార్తిక దీపాలను వెలిగించి కార్తిక దామోదరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పంచహారతులు నిర్వహించారు. అనంతరం అలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ కుండలలో దీపాలు వెలిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement